కరీంనగర్లో గురువారం కురిసిన భారీ వర్షానికి యూరియా లోడుతో వెళ్తున్న లారీ కాలువలో పడింది. అశోక్ నగర్లోని కళ్యాణ మండపం సమీపంలో వరద కాలువకు ఆనుకొని రహదారి ఉంది. వర్షానికి ఆ కాలువ కూలడం వల్ల లారీ అందులో పడిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా యూరియా పూర్తిగా పనికిరాకుండా పాడైంది. రహదారులు, కాలువ పనులు అసంపూర్తిగా చేపట్టడం వల్ల వర్షం నీరు నిండిపోయింది. నెలల తరబడి పనులు చేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆగ్రహించారు.
భారీ వర్షానికి యూరియా లారీ బోల్తా - కరీంనగర్
కరీంనగర్లో భారీగా కురిసిన వర్షానికి యూరియా లారీ కాలువలో పడింది. అశోక్ నగర్లో రహదారికి ఆనుకొని ఉన్న కాలువ కూలిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. యూరియా పూర్తిగా పనికిరాకుండా పాడైంది.
భారీ వర్షానికి యూరియా లారీ బోల్తా
ఇవీ చూడండి: తప్పతాగి రోడ్డెక్కుతున్న వాహనదారులు