కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని దిగువ మానేరు జలాశయంలో సబ్సిడి చేపపిల్లలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. ఇందులో భాగంగా 3లక్షల చేపపిల్లలను జలాశయంలో వదిలినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ సంతరించుకుందని 30 లక్షల చేపపిల్లలను ఎల్ఎండీలో వదలనున్నట్లు వెల్లడించారు. కుంటలు, చెరువులను అభివృద్ధిలోకి తెచ్చి జీవనోపాధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.
దిగువ మానేరులో చేపలు వదిలిన ఈటల - కరీంనగర్
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండున్నర కోట్ల చేపపిల్లలను వివిధ చెరువుల్లో వదలనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దిగువ మానేరు జలాశయంలో ఆయన చేపపిల్లలను వదిలారు.
చేపలు వదిలిన ఈటల