తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్​ ​బాబుకు పలువురు నేతల నివాళి - Leaders tribute to Driver Babu

గుండెపోటుతో మృతిచెందిన కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎన్.బాబు ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. డ్రైవర్‌ మృతదేహంతో కుటుంబసభ్యులు, నేతలు నిన్నటి నుంచి బైఠాయించారు. ఎంపీ బండి సంజయ్​, వివిధ పార్టీల నేతలు నిరసనలో పాల్గొన్నారు.

డ్రైవర్​ ​బాబుకు నేతల నివాళి

By

Published : Nov 1, 2019, 12:31 PM IST

కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ ఎన్.బాబు ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. డ్రైవర్​ మృతదేహాంతో మూడో రోజులుగా కుటుంబ సభ్యులు, నేతలు బైఠాయించారు. బుధవారం గుండెపోటుతో డ్రైవర్‌ ఎన్‌.బాబు మృతిచెందాడు.

ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు జరపబోమని చెబుతున్నారు. బాబు మృతదేహానికి టీఎన్జీవో జిల్లా నేతలు నివాళులర్పించారు. నిరసనలో ఎంపీ బండి సంజయ్, మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ ఐకాస నేతలు పాల్గొన్నారు.

ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ కరీంనగర్​ పట్టణంలో రెండో రోజు బంద్​ కొనసాగుతోంది.

డ్రైవర్​ ​బాబుకు నేతల నివాళి

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details