హుజూరాబాద్‌లో చేనేత కార్మికులను ఓట్లు అడిగే హక్కు ఈటల రాజేందర్‌కు లేదని తెరాస నేత ఎల్. రమణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రపరిశ్రమకు, కార్మికులకు మేలు చేసే ఎన్నో పథకాలు తొలగించిందని విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు తగ్గించడంతో పాటు జీఎస్టీతో మరింత భారం మోపిందని మండిపడ్డారు.
చేనేత కార్మికుల ఓట్లడిగే హక్కు ఈటలకు లేదు. చేనేత పరిశ్రమ ముందు కేంద్రం దోషిగా నిలబడింది. కులసంఘాలకు ఈటల చేసిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వమే నేతన్నకు అండగా నిలుస్తోంది. బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తూ.. ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి ఇస్తోంది.
-ఎల్. రమణ, తెరాస నేత