తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌకీదార్ కాదు.. దిల్​దార్ నాయకుడు కావాలి: కేటీఆర్ - చౌకీదార్ కాదు.. దిల్​దార్ నాయకుడు కావాలి: కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్​ కరీంనగర్​లో రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ తీరుపై మరోసారి మండిపడ్డారు. ప్రజలు చౌకీదార్​ని కాదు... కేసీఆర్​ లాంటి దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

చౌకీదార్ కాదు.. దిల్​దార్ నాయకుడు కావాలి

By

Published : Mar 30, 2019, 5:23 AM IST

Updated : Mar 30, 2019, 7:39 AM IST

చౌకీదార్ కాదు.. దిల్​దార్ నాయకుడు కావాలి
కుల మతాల పేరుతో గొడవలు సృష్టించే వారిని కాకుండా సౌమ్యుడైన ఎంపీ అభ్యర్థి వినోద్​కుమార్​ను గెలిపించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్​లో రోడ్ షోలో పాల్గొని, మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లుగా పాలించిన ప్రధాని తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా... చౌకీదార్​నంటూ కొత్త గళమెత్తారని విమర్శించారు. చౌకీదార్లు.. నేపాల్​ నుంచి వస్తారని ఈ చౌకీదార్​ ఎక్కడి నుంచి వచ్చారోనని ఎద్దేవా చేశారు. ప్రజలు కేసీఆర్​ లాంటి దిశానిర్దేశం చేసే వ్యక్తిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Last Updated : Mar 30, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details