తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీని సందర్శించిన జడ్పీపీ బృందం - జడ్పీపీ బృందం

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనిమిదో ప్యాకేజీని కరీంనగర్ జిల్లా జడ్పీపీ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​తో పాటు జడ్పీ సభ్యులందరూ పాల్గొన్నారు.

సాంకేతికత వినియోగంపై వివరించిన అధికారులు

By

Published : Jul 26, 2019, 10:27 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనిమిదో ప్యాకేజీని కరీంనగర్ జిల్లా జడ్పీటీసీ సభ్యులు సందర్శించారు. జడ్పీ ఛైర్మన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​తో కలిసి క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. అనంతరం రామడుగు మండలం లక్ష్మీపూర్ సొరంగ నిర్మాణాన్ని, పంపుసెట్లు, భూగర్భ చెరువు నిర్మాణ పనులను పరిశీలించారు.
120 మీటర్ల ఎత్తుకు గోదావరి నది జలాలను ఎత్తి పోసే డెలివరీ సిస్టం, గురుత్వాకర్షణ కాలువలను సందర్శించారు. నిర్మాణ పనులకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించే విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు వివరించారు.

సాంకేతికత వినియోగంపై వివరించిన అధికారులు
ఇవీ చూడండి : అధికారికంగా సీజ్ చేస్తారు... చాటుగా అమ్మేస్తారు

ABOUT THE AUTHOR

...view details