Karimnagar Railway Station Development : అమృత్ భారత్ పథకంతో కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ Karimnagar Railway Station Development under Amrit Bharat Scheme : దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు అమృత్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, కరీంనగర్ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. రెండో దశలో పెద్దపల్లి రైల్వే జంక్షన్ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను నేడు ప్రధాని మోదీ వర్చువల్‌గా దిల్లీ నుంచి ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో తగ్గిన కేంద్ర పథకాల నిధుల వ్యయం
Amrit Bharat Station Scheme telangana : దీనికోసం కరీంనగర్ నమూనా లఘుచిత్రాన్ని రైల్వే అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. స్టేషన్లలో అవతలి వైపు ప్లాట్‌ఫామ్‌ల వద్దకు వెళ్లేందుకు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా.. ఇరువైపులా లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్, వీఐపీ లాంజ్‌లు, ఫుడ్ ప్లాజా, బిగ్ క్యాంటీన్, బుక్ స్టోర్, దివ్యాంగులకు పూర్తిస్థాయి వసతులు, మరుగుదొడ్ల ఆధునికీకరణతో పాటు.. ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా గోడలపై చిత్రాలు వేయించనున్నారు.
"కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో గుర్తించి రూ.26 కోట్ల 60 లక్షల నిధులు కేటాయించింది. దీనివల్ల స్టేషన్ రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కానీ, అదనపు ప్లాట్‌ఫామ్స్ కానీ చాలా అందంగా నిర్మిస్తున్నారు." - శ్రీనివాస్, తీగలగుట్టపల్లి, కరీంనగర్
కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. ఇప్పటికే రామగుండం రైల్వే స్టేషన్‌లో లిఫ్టుల సౌకర్యం ఉండగా, అక్కడ ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
స్టేషన్ చుట్టుపక్కలా అభివృద్ధి..: పెద్దపల్లి జిల్లా అయిన తర్వాత పెద్దపల్లి జంక్షన్‌కు గతంలో కొన్ని నిధులు మంజూరు కాగా, ప్లాట్‌ఫామ్‌లపై, మెట్లపై టైల్స్ వేశారు. సైన్ బోర్డుల ఏర్పాటు, మరుగుదొడ్లకు మరమ్మతులు వంటి పనులు చేయనున్నారు. అలాగే బల్లార్షా నుంచి విజయవాడ వరకు చేపట్టిన మూడో లైన్ నిర్మాణ పనులు కూడా పూర్తికావొచ్చాయి. తాజాగా మంజూరైన నిధులతో జంక్షన్‌ను మరింత ఆధునికీకరించనున్నారు. ఆధునీకరణతో పాటు రైల్వే లైన్ల కనెక్టివిటీతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
"అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 500 స్టేషన్లను ఆధునికీకరించడానికి ఆమోదం తెలిపారు. తెలంగాణలో 40 స్టేషన్లను వరల్డ్ క్లాస్ సదుపాయాలతో తయారు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ కూడా అందులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ గ్రైనైట్, రైస్ సప్లైలో తెలంగాణలోనే ఆగ్రగామిగా ఉంది. కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో బ్రాడ్‌వేను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారానికి కూడా కొంత మేలు జరుగుతుంది". - చిట్టిమల్లి శ్రీనివాస్, అధ్యక్షుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్, కరీంనగర్
Karimnagar Floods 2023 : పంట పొలాలంతా ఇసుకనే సారూ... ఎలా పొలం పండించుకోవాలి.. కడుపు ఎలా నింపుకోవాలి..?
Karimnagar Missing Girl Death : అయ్యో పాప.. డ్రైనేజీలో కృతిక మృతదేహం లభ్యం