కరీంనగర్ కార్పొరేషన్లో నూతనంగా కొలువుదీరిన పాలకవర్గం నగర అభివృద్ధికి పాటుపడుతుందని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మొదటిసారి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థను రాష్ట్రంలోని హైదరాబాద్ స్థానంలో తీర్చిదిద్దుతామన్నారు.
కరీంనగర్‌ను హైదరాబాద్‌లా తీర్చిదిద్దుదాం: మేయర్ - కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు వార్తలు
కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి ఎప్పటికప్పుడు తెలిసేలా రెండు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. కార్పొరేషన్లో కొత్తపాలక వర్గం ఏర్పాటైన తర్వాత మొదటిసారి విలేకరుల సమావేశం నిర్వహించారు.
కరీంనగర్‌ను హైదరాబాద్‌లా తీర్చిదిద్దుదాం: మేయర్
నగరపాలికలో జరుగుతున్న పనితీరును ఎప్పటికప్పుడు తెలిసేవిధంగా అధికారులతో కలిసి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తామని.. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు కృషిచేస్తామని మేయర్ యాదగిరి తెలిపారు.
ఇవీ చూడండి:గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్