కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు 40వ డివిజన్ మెహర్నగర్ కాలనీవాసులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు పాల్గొని... కార్పొరేటర్ భూమా గౌడ్, మెహర్నగర్ అసోసియేషన్ సభ్యులతో కలసి నిత్యావసరాలు అందించారు.
'కొత్త కేసులు రాకపోయినా సరే... అప్రమత్తంగా ఉండండి'
కరోనా మహమ్మారి బారిన పడకుండా నగర ప్రజలు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు కచ్చితంగా పాటించాలని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు సూచించారు.
'కొత్త కేసులు రాకపోయినా సరే... అప్రమత్తంగా ఉండండి'
వైరస్ కట్టడిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మేయర్ సునీల్ రావు కొనియాడారు. నెల రోజులుగా కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసులు లేకపోవడం హర్షణీయమన్నారు. అయినప్పటికీ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు.
ఇవీ చూడండి:రాష్ట్రానికి అదనపు రుణానికి మార్గం సుగమం