తెలంగాణ

telangana

ETV Bharat / state

Mayor:'నాణ్యతా ప్రమాణాల్లో... నిర్లక్ష్యాన్ని సహించేదే లేదు' - Karimnagar District News

నగర అభివృద్ధి పనుల్లో భాగంగా చేపడుతున్న నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల్లో... నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అధికారులకు ఆదేశించారు. బాధ్యతా రాహిత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదని హెచ్చరించారు. నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

రీంనగర్ మేయర్ సునీల్ రావు
రీంనగర్ మేయర్ సునీల్ రావు

By

Published : Jun 20, 2021, 4:57 PM IST

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కరీంనగర్‌ మేయర్ సునీల్ రావు అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. నగరంలోని 26వ డివిజన్ కిసాన్​నగర్​లో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ నక్క పద్మతో కలిసి మేయర్ భూమి పూజ చేశారు.

నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలను అభివృద్ధి చేస్తామని మేయర్ అన్నారు. పేదలు ఎక్కువగా నివసించే 34, 25, 26 డివిజన్ల పరిధిలోని కిసాన్​నగర్, కార్ఖానా గడ్డ ఏరియాలో మౌలిక వసతులతో కూడిన పనులను చేపడుతున్నామని ఆయన చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా నగరంలోని ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు

ఇదీ చదవండి:Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

ABOUT THE AUTHOR

...view details