కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల సంరక్షణకు అవసరమైన కిట్లు పంపిణీ చేయాలని 1038 కిట్లు కొనుగోలు చేశామన్నారు. కార్మికులకు ఆయన ఆ కిట్లను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు కిట్లను పంపిణీ చేసిన మేయర్
కరోనా సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కరీంనగర్ మేయర్ సునీల్ రావు అభినందించారు. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మేయర్ వెల్లడించారు. వారి సంరక్షణ కోసం 1038 కిట్లను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు కిట్లను పంపిణీ చేసిన మేయర్
విధులు నిర్వర్తిస్తున్నప్పుడు విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని.. అందుకుగాను ప్రతి ఒక్కరికి కూడా చేతి తొడుగులతో పాటు కాళ్లకు బూట్లు, శానిటైజర్స్, కొబ్బరినూనె, సబ్బులు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ మనోధైర్యంతో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు కమిషనర్ క్రాంతితో పాటు మేయర్ సునీల్ రావు అభినందించారు.
ఇవీ చూడండి: 'సుందరమైన ప్రకృతి అందాలతో కరీంనగర్‌ను తీర్చిదిద్దుతాం'