తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యశాఖకు టిక్​ టాక్​ జబ్బు.. ముగ్గురిపై వేటు - టిక్​టాక్​ చేస్తూ ఉద్యోగుల నిర్లక్ష్యం

ఉద్యోగులు విధులను మరిచి టిక్‌టాక్‌ రూపొందించి ఉద్యోగాలను కోల్పోతున్న సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో టిక్‌టాక్‌లో నటించిన వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన మరుసటి రోజే కరీంనగర్‌లోనూ అలాంటి సంఘటన చోటు చేసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో టిక్​టాక్​ చేసిన ముగ్గురు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు.

టిక్​టాక్​

By

Published : Jul 27, 2019, 4:55 PM IST

టిక్​టాక్​ తెచ్చిన తంటా

కరీంనగర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ముగ్గురు ఉద్యోగులపై అధికారులు సస్పెన్షన్​ వేటు వేశారు. కార్యాలయంలో టిక్​టాక్​ చేసినందుకు చర్యలు తీసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న దివ్యమణి, సమత, ల్యాబ్ అటెండెంట్‌ జయలక్ష్మిలు టిక్‌టాక్‌లో నటించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం నిన్న రాత్రి వెలుగులోకి రాగా ఉద్యోగులకు షోకాజ్​ నోటీసు ఇవ్వాలని తొలుత భావించినా... అనంతరం ఉన్నతాధికారులు వీరిని సస్పెండ్​ చేశారు. ముగ్గురు కూడా కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగాలు పొందడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details