లాక్‌డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి కోరారు. నగరంలోని గీతాభవన్ కూడలిలో వాహనాల తనిఖీలను శుక్రవారం పర్యవేక్షించారు. సీఎంతో పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. మినహాయింపు వేళల్లోనూ గుంపులుగా బయటికి రావద్దని కోరారు.
'లాక్‌డౌన్ మరింత కఠినం.. గుంపులుగా బయటకు రావొద్దు' - తెలంగాణ వార్తలు
లాక్‌డౌన్ నేపథ్యంలో కరీంనగర్లో వాహనాల తనిఖీలను సీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించారు. లాక్డౌన్ను మరింత కఠినం చేసినట్లు తెలిపారు. మినహాయింపు వేళల్లో గుంపులుగా బయటకు రావొద్దని సూచించారు.
కరీంనగర్లో లాక్డౌన్పై సీపీ వ్యాఖ్యలు, సీపీ పర్యవేక్షణలో లాక్‌డౌన్
అత్యవసరమైతేనే బయటికు రావాలని సూచించారు. కరోనా రెండో దశ తీవ్రతను గమనించాలని అన్నారు. ఇప్పటికే 875 వాహనాలు సీజ్ చేశామని.. 4,600 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. సీజ్ చేసిన వాహనాలు లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు పోలీసుల దగ్గరే ఉంటాయని స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి:లాక్‌డౌన్ ఉల్లంఘనపై పోలీసుల ఉక్కుపాదం