కరీంనగర్ దిగువ మానేరు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం పట్ల కార్పొరేటర్లు సంబరాలు జరుపుకున్నారు. 4 కిలోమీటర్ల మేర రిటైనింగ్‌వాల్ నిర్మాణానికి రూ.310.64కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తీగలవంతెనపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అభివృద్దికి మారుపేరు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నగర అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్‌కు కార్పొరేటర్ల పాలాభిషేకం - తెలంగాణ వార్తలు
కరీంనగర్ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దిగువ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించారని తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం, కరీంనగర్ కార్పొరేటర్
రివర్ ఫ్రంట్‌లో భాగంగా రూ.80కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. నగర అభివృద్దికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా రెండో దశతో 'గుడ్డు'కు భలే గిరాకీ