కరీంనగర్ నగర ప్రజలకు 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన తెరాస ఆచరణలో మాత్రం విఫలమైందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన కథనాలను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శిస్తూ నగరంలోని మార్కెట్ రిజర్వాయర్ ఎదుట ధర్నా చేశారు. పట్టణ ప్రజలకు నిరంతరం నీరు ఇవ్వలేదని... మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు ప్రశ్నించారు. మిషన్ భగీరథ పేరు మీద అమృత్ నిధులు వేల కోట్లు ఖర్చు చేసి ఏళ్లు గడుస్తున్నా.... నీరు మాత్రం అందడం లేదని ఆరోపించారు.
'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు' - తెరాసపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శలు
గత ఎన్నికల్లో 24 గంటలు తాగునీరందిస్తామని చెప్పిన తెరాస... ఇప్పటికీ నీరందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్.
'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు'