కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డును కలెక్టర్ శశాంక పరిశీలించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య అధికారులతో సమీక్షించారు.
కరోనా వార్డును పరిశీలించిన కలెక్టర్ శశాంక - karimnagar collector shashanka
కరోనా బాధితులకు చికిత్స చేసే క్రమంలో వైద్యులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డును పరిశీలించారు.
karimnagar collector shashanka visited corona ward
అనంతరం కరోనా వైరస్ నిర్ధరించేందుకు ఏర్పాటు చేసిన బూత్‌ను పరిశీలించారు. కరోనా బాధితులను పరీక్షించేటప్పుడు వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, కరోనా అనుమానితులు, ఇతర రోగులు పరస్పరం ఎదురు పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.