తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి' - కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా... గ్రామపంచాయతీ కార్యాలయం గోడపై అధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్​ నెంబర్లు రాయాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక ఆదేశించారు.

karimnagar collector shashanka visit to kurikyala village
కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక కురిక్యాల సందర్శన

By

Published : Dec 24, 2019, 6:08 PM IST

కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక కురిక్యాల సందర్శన

కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో కలెక్టర్​ శశాంక పర్యటించారు. గ్రామంలో ఇప్పటి వరకు నిర్మించిన ఇంకుడు గుంతల నిర్మాణ వివరాలను సూచిక బోర్డుపై ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.

మిషన్ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్​ ఆరా తీశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం పూర్తైన వెంటనే ట్యాబ్​ ద్వారా ఆన్​లైన్ చేస్తున్న విధానాన్ని తనిఖీ చేశారు. వైకుంఠధామం చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు.

కురిక్యాలలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని సర్పంచ్ మేచినేని నవీన్ రావు కోరగా... పరిశీలిస్తామని కలెక్టర్ శశాంక తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా... గ్రామపంచాయతీ కార్యాలయం గోడపై అధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్​ నెంబర్లు రాయాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details