కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు, దుద్దెనపల్లి, గొడిశాల గ్రామాల్లో కలెక్టర్ శశాంక ఆకస్మికంగా పర్యటించారు. రైతు వేదిక భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ సర్వేను అధికారులు ఏ విధంగా చేపడుతున్నారో స్వయంగా పలు ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. సర్వేకు ప్రజల సహకారం ఎలా ఉందని, ఏఏ విషయాలను వారి నుంచి తెలుసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ ఆకస్మిక పర్యటన... ఎల్ఆర్ఎస్ సర్వేపై ఆరా - karimnagar news
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శశాంక పర్యటించారు. రైతు వేదిక భవనాల పురోగతిని పరిశిలించారు. గ్రామాల్లో అధికారులు చేపట్టిన ఎల్ఆర్ఎస్ సర్వేపై ఆరా తీశారు. ప్రజలు ఎలా సహకరిస్తున్నారు.. అధికారులు ఎలాంటి సమాచారం తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.
karimnagar collector shashanka sudden visit in villages
ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఏ ఏ గ్రామాలు, వార్డులకు వెళ్తున్నారో ఆ స్థానికులకు ఒకరోజు ముందుగా సమాచారం అందివ్వాలని తెలిపారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబూడ్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, ఎమ్మార్వో సదానందం, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.