తెలంగాణ

telangana

ETV Bharat / state

'పల్లె ప్రగతిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలి' - పల్లె ప్రగతిపై కరీంనగర్​ జిల్లా కలెక్టర్  శశాంక అవగాహన కార్యక్రమం

కరీంనగర్​ జిల్లాలోని  అన్ని గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో అభివృద్ది చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్  శశాంక అన్నారు. కలెక్టరేట్​ ఆడిటోరియంలో పల్లె ప్రగతి రెండో విడత సన్నాహక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

karimnagar collector shashanka awareness meeting on palle pragathi program
'పల్లె ప్రగతిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలి'

By

Published : Dec 28, 2019, 2:01 PM IST

'పల్లె ప్రగతిలో ప్రజలందరు భాగస్వామ్యం కావాలి'

పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వామ్యులు చేయాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ శశాంక అన్నారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించాలని అధికారులకు సూచించారు.

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్​ తెలిపారు. మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టి పూర్తి చేసిన పనులన్నీని రెండో విడతలో ప్రజలకు తెలపాలని సూచించారు.

ప్రతి రోజు కార్యక్రమాలను రిజిస్టర్​లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. గ్రామాల్లో ఉపయోగంలో లేని బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్​ను పూడ్చివేయించాలని సూచించారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో.. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులందరు పోటీపడుతూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details