కరీంనగర్లో 42 పార్కుల నిర్మాణాలకు స్థలాలు సేకరించగా.. 21 పార్కులు అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లతో టెండర్లు పిలిచినట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.26 లక్షలతో చేపట్టే పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కాలనీని నగరంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
కరీంనగర్లో 21 పార్కుల నిర్మాణానికి టెండర్లు : సునీల్ రావు
కరీంనగర్లో హౌసింగ్ బోర్డుకాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు.
కరీంనగర్ మేయర్ సునీల్ రావు
స్మార్ట్ రహదారి పనులను ఆరు నెలలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 24 గంటల నీటి సరఫరా చేసేందుకు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
Last Updated : Jan 22, 2021, 3:15 PM IST