కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. ఎనిమిదో ప్యాకేజ్ ఎత్తిపోతల పథకం వెట్‌రన్ విజయవంతమైంది. మిడ్ మానేరు జలాశయానికి కాళేశ్వర జలాలను తరలించే ప్రక్రియలో ఎనిమిదో ప్యాకేజీ కీలకమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద పంపుహౌస్‌లో అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఐదో పంపు ద్వారా 3,100 క్యూసెక్కుల నీటిని వరద కాలువలోకి విడుదల చేశారు. వెట్‌రన్ విజయవంతం కావటం వల్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ వెట్‌రన్ విజయవంతం - కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనిమిదో ప్యాకేజ్ ఎత్తిపోతల పథకం వెట్‌రన్ విజయవంతమైంది. ఐదో పంపు ద్వారా 3,100 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ వెట్‌రన్ విజయవంతం