ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తాము కొనసాగుతామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఎంపీపీతో పాటు సింగిల్‌విండో ఛైర్మన్, ఎంపీటీసీలు, పలువురు నాయకులు జమ్మికుంటలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తెరాస జెండాతో గెలిచాం.. తెరాసలోనే ఉంటాం: ఎంపీపీ - telangana news
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎంపీపీ దొడ్డె మమతతో పాటు సింగిల్‌విండో ఛైర్మన్, ఎంపీటీసీలు, పలువురు నాయకులు సమావేశమయ్యారు. తెరాస జెండాతో గెలిచిన తాము తెరాసలోనే కొనసాగుతామని ఎంపీపీ స్పష్టం చేశారు.
Jammikunta mpp Dhodde Mamatha, meeting at jammikunta, karimnagar news
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని ఎంపీపీ పేర్కొన్నారు. తెరాస జెండాతో ఎన్నికల్లో నిలబడి గెలిచిన తాము తెరాసలోనే పని చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామన్నారు. జమ్మికుంట మండలాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్‌తోనే ఉంటాం: జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్