కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన తుపాకుల రామస్వామికి బలహీనవర్గాల కింద ప్రభుత్వం కొత్త వ్యవసాయ మార్కెట్ సమీపంలో గుంటన్నర భూమి ఇచ్చింది. దీనికి సంబంధించి పట్టాను లబ్ధిదారుడికి అందించింది. ఆ స్థలంలో తెరాస నాయకుడు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ తన భార్యతోపాటు తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్న నిరసనకు దిగారు. వంటవార్పు నిర్వహించారు. న్యాయం చేయాలని కోరారు.
నా భూమిలో పార్టీ ఆఫీస్ పెట్టారు..న్యాయం చేయండి.. - trs
ప్రభుత్వం తంకిచ్చిన భూమిని తెరాస నాయకుడు కబ్జా చేశారంటూ దంపతులు వినూత్న నిరసన చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ముందు వంటవార్పు నిర్వహించారు.
వంట చేసుకుంటున్న దంపతులు
ఇదీ చదవండిః కారు ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి