తెలంగాణ

telangana

ETV Bharat / state

పుడమిలోనూ 'స్త్రీ' ఉపాధి - mines act

పురుషులతో పాటు స్త్రీలకు ఉద్యోగ, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్రం గనుల చట్టాన్ని సవరిస్తూ... భూగర్భంలో మహిళలు పనిచేసేందుకు అనుమతిచ్చింది.

గనుల చట్టం

By

Published : Feb 18, 2019, 6:15 AM IST

Updated : Feb 18, 2019, 7:40 AM IST

గనుల చట్టం
మహిళా సాధికారతను పెంచే దిశగా సింగరేణి గనుల్లో పనిచేసేందుకు తొలిసారిగా అతివలకు అవకాశం కల్పించారు. భూగర్భ గనుల్లో మగువలు పనిచేయడానికి గనుల చట్టం 1952లోని నిబంధనలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో బొగ్గు, బంగారం గనులు, చమురు క్షేత్రాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇప్పటి వరకు సింగరేణి వర్క్ షాపు బ్లాస్టింగ్ తయారీ షెడ్​లలో మాత్రమే మహిళలు పనిచేస్తున్నారు. గనుల్లో ఉపయోగించే యంత్రాలను 35 ఏళ్లుగా వీరే మరమ్మతులు చేస్తున్నారు. ఇకపై గనుల్లోనూ ప్రవేశం లభించనుంది. మగవారికి దీటుగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల, పారిశ్రామిక శిక్షణ విద్యార్థినిలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తాము చదువుతున్న సంస్థలోనే ఉద్యోగాలు లభిస్తాయని సంతోష పడుతున్నారు.
Last Updated : Feb 18, 2019, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details