హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ - ఈటల నామినేషన్
14:32 October 08
హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్
హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు అందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఈనెల 30 న జరగనుంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల సమర్పించేందుకు చివరి రోజు కావటంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు రావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. పీసీసీ ఉపాధ్యక్షులు దామోదర రాజనర్సింహ పొన్నం ప్రభాకర్‌తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి:Huzurabad By Election 2021: హుజూరాబాద్‌లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్