తెలంగాణ

telangana

ETV Bharat / state

స్పందించిన మానవత్వం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ - humanity towards poor people

కుటుంబాన్ని పోషించే దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి సమాజం ఆసరాగా నిలిచింది. మేమున్నామంటూ భరోసా కల్పించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు పలువురు సహృదయులు. కరీంనగర్‌ జిల్లాకి చెందిన తిరుపతి అనే వ్యక్తి చనిపోయాక ఉండటానికి గూడు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబీకులకు దాతలు ఆర్థిక అవసరాలు తీరుస్తున్నారు. ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన వారి కథనానికి పలువురు స్పందించి ముందుకు వచ్చారు.

huminists helping to poor family in karimnagar district
స్పందించిన మానవత్వం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ

By

Published : Nov 8, 2020, 8:21 AM IST

పోషించే దిక్కును కోల్పోయి ఆర్థిక నష్టాల్లో ఉన్న కుటుంబం గురించి ఈటీవీ భారత్​లో వచ్చిన కథనం చూసి తెలుసుకున్న పలువురు సహాయం చేయడానికి మానవత్వంతో ముందుకొచ్చారు. కరీంనగర్‌ జిల్లా తిర్మలాపూర్‌‌లో నివాసం ఉంటున్న కముటం తిరుపతి అనే వ్యక్తి మరణించాక అతని కుటుంబం ఉండటానికి గూడు లేక సంఘం భవనంలో నివాసముంటోంది. విషయం తెలుసుకున్న దాతలు ఆపన్నహస్తం అందించారు.

భాగ్యనగర వాసుల భరోసా

జైపాల్ మిత్రమండలి అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి రూ. లక్ష 70 వేల ఆర్దిక సహాయంతో పాటు ప్రతి నెల రూ. 5వేల అందించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన మారం ఇన్‌ఫ్రాకి చెందిన సతీష్‌కుమార్‌ రూ. 10వేల ఆర్ధిక సహాయంతో పాటు ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీజు అందిస్తానని హామీ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నంద, జీవన్‌‌ వారికి బ్లాంకెట్లు, దుస్తులను సమకూర్చారు.

వారికి ఇల్లు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు దాతలు తెలిపారు.

ఇదీ చదవండి:స్టాఫ్​ నర్సుల నియామక పరీక్ష మెరిట్​ జాబితా విడుదల

ABOUT THE AUTHOR

...view details