కరీంనగర్ జిల్లా కమలాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఆసరా పింఛన్ల పత్రాలను మంత్రి ఈటల రాజేందర్ పంపిణీ చేశారు. దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016లు అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సంబంధించిన ఉత్తర్వులను అందించారు. 65 ఏళ్లు నిండిన వారికి రూ.2వేల పింఛన్లను ఇస్తున్నట్లు వివరించారు. డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతాయని స్పష్టం చేశారు. పేదరికంలో ఉన్నవారికి ఇది గొప్ప ఆసరా అని పేర్కొన్నారు.
'నేటి నుంచే పెంచిన పింఛన్ల పంపిణీ'
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటి నుంచి అమలు పరుస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పెంచిన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
పెంచిన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులకు పత్రాలను అందించిన ఈటల