రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపడేశారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు వచ్చే సాధారణ జ్వరాలు అధికశాతం ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతి జ్వరానికి కంగారు పడాల్సిన పనిలేదని ఆయన సూచించారు. ఇప్పటికే పది జిల్లాల్లోని ఆసుపత్రులలో పర్యటించానని.. ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని మంత్రి చెప్పారు. కోట్ల నిధులు వైద్యం కోసం వెచ్చిస్తున్నా.. కొన్ని చోట్ల నిర్వహణ లోపం ఉందంటోన్న మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...
ప్రచారానికి.. వాస్తవానికి చాలా తేడా ఉంది - డెంగీ
ప్రతి జ్వరం.. డెంగీ కాదని.. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపడేశారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్