కరీంనగర్ జిల్లాలో 55 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి.. జిల్లా వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసినట్టు పాలనాధికారి శశాంక అన్నారు. కరీంనగర్ జిల్లా సదాశివపల్లి పట్టణంలో నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక అన్నారు.
'మొక్కలు నాటి వాటి సంరక్షణలోనూ బాధ్యత వహించాలి' - latest news of karimnagar
కరీంనగర్‌లోని సదాశివపల్లి, తదితర ప్రాంతాల్లో కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్‌రావు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యతనూ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
'మొక్కలు నాటడమే కాదూ వాటి సంరక్షణలోనూ బాధ్యత వహించాలి'
ఇంటింటికి మొక్కలు నాటి పర్యావరణ ఉత్పాదకతను పెంచాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొనాలని.. మొక్కల సంరక్షణలో తమ వంతు బాధ్యత వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మానకొండూర్ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నెలరోజుల్లో ఎన్నివేల కోట్లు తాగేశారో తెలుసా?
Last Updated : Jun 30, 2020, 7:03 PM IST