కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య సౌదీ అరేబియాలో బందీ అయ్యాడు. రెండేళ్లుగా పనిచేయించుకుని తిండిపెట్టకుండా అరబ్షేక్ చిత్రహింసలు పెట్టాడు. యాజమాని చేతిలో నరకం అనుభవించిన వీరయ్య..తన గోడును వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీరయ్య ధీనగాథను చూసిన వారంతా చలించిపోయారు.
అరబ్షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య - makthapalli
సొంతూళ్లలో పని లేక ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్న ఎందరో తెలంగాణ బిడ్డలు పరాయి దేశంలో గోస పడుతున్నారు.
అరబ్షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య
దేశం కాని దేశంలో వీరయ్య పడుతున్న గోసను చూసి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ స్పందించారు. స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని అక్కడి రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేసారు. 25రోజుల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు వీరయ్య స్వగ్రామానికి చేరుకున్నాడు. జూన్ 25న అబుదాబి నుంచి బయల్దేరి గురువారం ఇంటికి చేరుకున్నాడు.
ఇదీ చూడండి: బాతుల సరదా..బాటసారుల ఫిదా..
Last Updated : Jun 29, 2019, 8:10 PM IST