తెలంగాణ

telangana

ETV Bharat / state

గంజాయి గుట్టు రట్టు - ganjayee

కరీంనగర్​లో అక్రమంగా విక్రయిస్తున్న గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 75కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ రూ.3.75 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు.

కరీంనగర్​లో గంజాయి గుట్టు రట్టు

By

Published : Mar 12, 2019, 8:36 AM IST

కరీంనగర్​లో గంజాయి గుట్టు రట్టు
కరీంనగర్​లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 75కిలోల గంజాయిని హుజూరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాలపల్లి-ఇందిరానగర్​లో వాహనాల తనిఖీ చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతూ కనపడ్డారు. పట్టుకుని తనిఖీ చేయగా ఓ సంచిలో మూడు ప్యాకెట్ల గంజాయి లభించినట్లు తెలిపారు. వారిని విచారించగా రవి అనే వ్యక్తి ఇంట్లో నిల్వలు ఉంచినట్లు తెలిపారు. వారి ఇంట్లో సోదాలు చేసి 75 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.75 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, మూడు చరవాణిలు, రూ.4వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.ఛత్తీస్​గఢ్ రాష్ట్రం నుంచి ఇక్కడికి తరలించినట్లు వివరించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details