జిల్లా ప్రాదేశిక, మండల ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్ధులను గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం చేశారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించింది గ్రామీణ ప్రజలేనని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి బలపరచాలని ఆయన కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామీణ ప్రజలకే బాగా తెలుసని పేర్కొన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు కావాలంటే ఈ ఎన్నికల్లోనూ తెరాస అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెరాస సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకే బాగా తెలుసు - gangula
ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని బొమ్మకల్‌లో ప్రారంభించారు.
తెరాస సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకే బాగా తెలుసు