కరోనా నేపథ్యంలో పౌల్ట్రీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులోని పకీర్ అనే పౌల్ట్రీ నిర్వాహకుడు సుమారు 5 వేల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో కోళ్లు అమ్ముడుపోలేని పరిస్థితి ఏర్పడిందని.. వాటి ధరలు అమాంతం పడిపోయాయని పకీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కరోనా దెబ్బకు ఉచిత కోళ్ల పంపిణీ - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్
కరోనా దెబ్బకు పౌల్ట్రీ నిర్వాహకులు విలవిల్లాడిపోతున్నారు. అమాంతంగా చికెన్ ధరలు పడిపోవటం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ.. చేసేదేమిలేక కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరోనా దెబ్బకు.. ఉచిత కోళ్ల పంపిణీ
ఈ కోళ్లను తీసుకెళ్లేందుకు గ్రామీణులు తరలివచ్చారు. ఒకొక్క కోడి బరువు కిలో నుంచి రెండున్నర వరకు ఉందని పలువురు చెబుతున్నారు. కోళ్లకు దాణా పెట్టలేక వాటిని ఉచితంగా పంపిణీ చేసే పరిస్థితి నిర్వాహకులకు ఏర్పడిందని గ్రామ సర్పంచ్ నేరళ్ల మహేందర్ తెలిపారు. పౌల్ట్రీ నిర్వాహకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకొక్క రైతు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు నష్టపోయారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు