కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శలు (Harish Rao Comments) గుప్పించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. పెంచికల్‌పేటలో మహిళలతో సమావేశమైన మంత్రి హరీశ్... భాజపాకు ఓటు వేయకూడదని అభ్యర్థించారు.
కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోందని ఆరోపించారు. అన్నీ అమ్మేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు గ్యాస్ సిలిండర్ ధరను మహిళలు గుర్తుంచుకోవాలన్న హరీశ్‌రావు... సిలిండర్ ధరను రూ.వెయ్యికి పెంచారని గుర్తు చేశారు. ఈ ధరను త్వరలోనే రూ.1,500కు పెంచుతారని ఎద్దేవా చేశారు. కిలో వంట నూనె ధర దాదాపు రూ.200, పెట్రోల్, డీజిల్ ధర రూ.100 దాటిపోయిందన్నారు.