తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం నీటిని పొలాలకు అందించాలని ఆందోళన - చొప్పదండిలో రైతన్నల రాస్తారోకో

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు నేరుగా పొలాలకు అందించాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల రహదారిపై బైఠాయించడం వల్ల వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

చొప్పదండిలో రైతన్నల రాస్తారోకో

By

Published : Sep 4, 2019, 4:48 PM IST

చొప్పదండిలో రైతన్నల రాస్తారోకో

కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్​హౌస్ నుంచి సాగునీరును నేరుగా పొలాలకు అందించాలని కోరుతూ రైతులు కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో రాస్తారోకో చేపట్టారు. ఈ మేరకు కరీంనగర్, మంచిర్యాల రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఆందోళనను అదుపుచేసే ప్రయత్నం చేసినా... వారు నిరసన కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details