తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో రైతులు నిరసనకు దిగారు. కరీంనగర్ మండలం నంగునూరు గ్రామానికి చెందిన తుంటి బీరయ్య, తుంటి మహేందర్‌కు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు నూతన పట్టా పాస్ బుక్‌లో ఇతరుల పేరిట రాశారని ఆరోపించారు. ఈ భూమిపై పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అందరి ముందు సమానంగా పంపిణీ చేసిన అధికారులు.. గుట్టు చప్పుడు కాకుండా తమ వాటా భూమిని ఇతరుల పేరిట రాశారని మహేందర్ తెలిపాడు. మనస్తాపం చెందిన బాధితుడు తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన చేపట్టారు.
భూమి కోసం పురుగుల మందు డబ్బాతో నిరసన - కరీంనగర్ అర్బన్
ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ భూమి విషయంలో స్పందించట్లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. చేసేది లేక కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు.
క్రిమిసంహారక మందు డబ్బుతో నిరసనకు దిగిన బాధితులు