తెలంగాణ

telangana

ETV Bharat / state

'సుష్మా... ప్రతి పౌరుడి మదిలో నిలిచిపోతారు' - bjp

సుష్మాస్వరాజ్​ మరణం ప్రతి తెలంగాణ పౌరుడిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆమె మద్దతును రాష్ట్ర ప్రజలు మరచిపోరని తెలిపారు.

మదిలో నిలిచిపోతారు

By

Published : Aug 7, 2019, 10:14 AM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి భాజపా జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సుష్మా కనుమూయడం కలచివేసిందన్నారు. తమ ఆత్మీయురాలును పొగొట్టుకున్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడు మదిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య తెలంగాణ పౌరుడి మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్ అని బండి పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి గవర్నర్​గా వస్తుందన్న ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె అనుసరించిన సైద్ధాంతిక ఆలోచనా ధోరణిలో తెలంగాణ ప్రజలు పయనించడమే ఆమెకు రాష్ట్ర ప్రజలు ఇచ్చే అసలైన నివాళి అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details