ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ పులకించేందని.. ఆయన అడుగులో అడుగేసేదని భాజపా నేత, హుజూరాబాద్ అభ్యర్థి(Etela Rajender at Sriramula Pally) ఈటల రాజేందర్ అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ను తిడితే ప్రజలు చప్పట్లు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఆయన పాలనపై ప్రజలు ఎంత విరక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపుర్ మండలం, శ్రీరాములపల్లిలో(Etela Rajender at Sriramula Pally) ఈటల ప్రచారం నిర్వహించారు. ఆయన గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌తో పాటు తెరాస అభ్యర్థి తరఫున హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలపై ఈటల నిప్పులు చెరిగారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని మంత్రి హరీశ్ అడుగుతున్నారని.. తన నియోజకవర్గ ప్రజలకోసం హరీశ్ రావు ఏం చేశారని ఈటల(Etela Rajender at Sriramula Pally) ప్రశ్నించారు. కళ్లు ఉండి కూడా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మామాఅల్లుడు అబద్ధాల కోరులని కేసీఆర్, హరీశ్‌ను ఉద్దేశించి ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు.