తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Clarity on Competition from Gajwel : గజ్వేల్ నుంచి పోటీపై ఈటల రాజేందర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే..?

Etela Clarity on Competition from Gajwel : కరీంనగర్​ జిల్లాలోని జమ్మికుంటలో జరగనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బహిరంగ సభ ఏర్పాట్లను హూజరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తాను గజ్వేల్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పిన మాట ఆషామాషీ కాదని.. కచ్చితంగా బరిలో నిలిచి సీఎం కేసీఆర్​ను ఓడిస్తానని తెలిపారు.

Minister Rajnath Singh Meeting
Etela Rajender Comments on CM KCR

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 1:09 PM IST

Etela Clarity on Competition from Gajwel గజ్వేల్ నుంచి పోటీపై ఈటల రాజేందర్‌ క్లారిటీ ఏమన్నారంటే

Etela Clarity on Competition from Gajwel : సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌(Ghazwal) నుంచి పోటీ చేస్తానని చెప్పింది ఆషామాషీగా కాదని.. కచ్చితంగా అక్కడి నుంచి బరిలో దిగి తీరుతానని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్​ జిల్లాలోని జమ్మికుంటలో జరగనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Rajnath Singh) బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన సవాల్‌పై ఈటల స్పందించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు.

Gangula Kamalakar Challenge to Etela : గజ్వేల్​ నుంచి మాత్రమే పోటీ చేయాలి.. ఎమ్మెల్యే ఈటలకు మంత్రి గంగుల సవాల్

Etela Rajender Challenge to CM KCR : ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసి, అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా.. గెలిచానని ఈటల గుర్తు చేశారు. ఆ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడించటమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకేగజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించానన్నారు.

నేను హుజూరాబాద్​ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్​కు ఛాలెంజ్​ చేశాను. ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్​ను ఓడించడమే లక్ష్యమని చెప్పాను. ఆ విధంగానే నేను గజ్వేల్​ నియోజకవర్గంలో పోటీ చేస్తాను. నేను మాట మీద నిలబడతాను. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో నా మీద గెలిచేందుకు కేసీఆర్‌ రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ఎన్నికలు జరిగినప్పుడే చెప్పినా.. దమ్ముంటే కేసీఆర్​ పోటీ చేయాలని. నేను ప్రజల మద్దతు, ఆశీర్వాదం కలిగిన నాయకుడిని. 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. మంచి, చెడులు తెలుసు. వాటికి అనుగుణంగానే స్టేట్​మెంట్​లు ఇస్తాం. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్​ను ఓడిస్తాం. - ఈటల రాజేందర్​, హుజూరాబాద్ ఎమ్మెల్యే

BJP Meeting in Jammikunta : మరోవైపు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి హాజరయ్యే బహిరంగ సభకు భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఈటల తెలిపారు. ఈసారి సీఎం కేసీఆర్(CM KCR) ఓటమి బీజేపీ చేతిలోనేనని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. జమ్మికుంటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్​ఎస్​ పోటీ చేసే అభ్యర్థులను, మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్​ పార్టీ తన రేసుగుర్రాల తొలి జాబితాను ప్రకటించింది. నవంబర్​ నెలలో ఎన్నికల నోటిఫికేషన్​ రానుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.

Etela Rajender in Mudiraj Meeting : కొట్లాడాలే తప్ప జేజేలు కొడితే బతుకులు మారవు.. ముదిరాజ్​ సభలో ఈటల

Etela Rajendar Counter To KTR Tweet : 'మోదీపై విమర్శలు.. కేసీఆర్‌ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం'

Etela Rajendar Fires on CM KCR : 'రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుంది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details