కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్‌లో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.
'బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్'
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బీఆర్ అంబేడ్కర్ అని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. హుజూరాబాద్‌లో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అంజలి ఘటించారు.
'బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్'
అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గందె రాధిక, వైస్ ఛైర్‌పర్సన్ కొలిపాక నిర్మల, అంబేడ్కర్ కమిటీ అధ్యక్షులు కోండ్ర నరేష్, తెరాస రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'అంబేడ్కర్ కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం'