వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు - karimnagar
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిన్నారులను కళలకు ప్రోత్సహిస్తే అవి వారి వికాసానికి బాటలు వేస్తాయి కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు.
ముగింపు ఉత్సవాలు
కరీంనగర్లోని జవహర్ బాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. సెలవులు వృధా చేయకుండా తల్లితండ్రులు వారి పిల్లలను వేసవి శిబిరాలకు పంపినందుకు ఆయన అభినందించారు. కళలను నేర్చుకునేలా ఉపాధ్యాయిలు కూడా వారిని ప్రోత్సహించాలని సూచించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.