కరీంనగర్‌లో ఫిజీషియన్ల నాలుగో రాష్ట్ర సదస్సును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పిజీషియన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరీఖ్ హాజరయ్యారు.
'వైద్యులు.. ఆత్మావలోకనం చేసుకోండి' - ప్రారంభించారు
వైద్యులను పూజించే స్థాయి నుంచి వైద్యులపై దాడులు జరిగే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ రంగంలో వ్యాపార దృక్పథం సరికాదన్నారు.
ఫిజీషియన్ల రాష్ట్ర సదస్సును ప్రారంభించిన మంత్రి ఈటల
వైద్య ఖర్చుల కోసం పేదలు, ధనికులు ఒకే స్థాయిలో డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడే ఘర్షణ వాతావరణం నెలకుంటోందని మంత్రి ఈటల పేర్కొన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. వైద్యరంగంలోకి వ్యాపార దృక్పథంతో వచ్చే వారి సంఖ్య పెరగుతుండటం వల్లే వైద్యులకు చెడ్డపేరు వస్తోందని ఎంపీ బండి సంజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : భాజపాలో చేరనున్న మాజీమంత్రి మోత్కుపల్లి