కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నతమైన సేవలందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మేయర్ సునీల్‌రావుతో కలిసి విపత్తునివారణ బృందానికి సంబంధించిన ప్రత్యేక వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. దాదాపు 56లక్షల రూపాయలతో ఈవాహనంలో ప్రత్యేక పరికరాలను సమకూర్చినట్లు తెలిపారు. రాష్ట్రరాజధానిలో వరద పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం: గంగుల - కరీంనగర్లో విపత్తు నివాహణ వాహనం ప్రారంభం
ఇటీవలె కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్‌లో ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమయంలోనైనా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలను అమలు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో విపత్తునివారణ బృందానికి సంబంధించిన ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం: గంగుల
అందుకుగాను 40మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని... ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎప్పుడైనా ఈనంబర్‌కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చని మంత్రి కమలాకర్ వివరించారు. ఈకార్యక్రమంలో కమిషనర్ క్రాంతితో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత
TAGGED:
Disaster prevention vehicles