తెలంగాణ

telangana

ETV Bharat / state

సారూ మా సమస్యలు తీర్చండి.. 48 గంటలుగా ఆశావర్కర్ల నిరసన

Dharna by Asha activists in Karimnagar: కరీంనగర్​లో తమ సమస్యలు తీర్చమని ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వీరు వినూత్నంగా బతుకమ్మ పాటల రూపంలో తమ నిరసన తెలిపారు. వారి సమస్యలన్ని పాటకి పల్లవిలా చేసి పాడుతూ ధర్నా చేశారు.

Dharna by Asha activists
ఆశా కార్యకర్తల ధర్నా

By

Published : Dec 16, 2022, 10:23 PM IST

Dharna by Asha activists in Karimnagar: ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని 48 గంటల పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆశ కార్యకర్తలు ఈ రోజు రాత్రి కార్యాలయం దగ్గరే నిద్రించి ప్రభుత్వానికి మేలుకువ వచ్చే వరకు ప్రయత్నం చేస్తామని ఆశా కార్యకర్తలు అన్నారు. బతుకమ్మలు ఆడుతూ నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కారించాలని ఆశా యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు.

పనికి తగ్గ డబ్బులు ఎక్కడ: తమ సమస్యలు పరిష్కరించకుండా అదనంగా లెప్రసి, కంటి వెలుగు లాంటి పనులు, స్ఫూటం టెస్టులు చేపిస్తూ వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆశాలు ఆరోపించారు. గతంలో చేసిన లెప్రసి సర్వే, కంటి వెలుగు బకాయిలు, 16 నెలల పెండింగ్ కరోనా రిస్క్ అలవెన్స్​లు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. వైద్యశాఖ సర్వేలే కాకుండా అనేక డిపార్ట్​మెంట్ సర్వేలు ఆశా కార్యకర్తలుతో నిర్వహిస్తున్నారని వాటికి ఒక్క రూపాయి చెల్లించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వెట్టిచాకిరిని రద్దుచేసి ఆశా కార్యకర్తలకు ఫిక్స్​డ్ వేతనం నిర్లయించాలని.. అదనపు పనికి అదనపు పారితోషకం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

శ్రమకు తగ్గ ఫలితం లేదు: ప్రస్తుతం ధరలకు అనుగుణంగా కనీస వేతనం ప్రతి కార్మికుడికి 26 వేల రూపాయలు ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు రిపోర్టులు పంపిస్తుంటే.. కనీస వేతనం ఇవ్వకుండా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details