కరీంనగర్ జిల్లా విషజ్వరాలతో అట్టుడికి పోతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీపీఐ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రులలో సరైన వసతులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడం వల్ల కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లారు.
'విషజ్వరాలతో బాధపడుతున్నా యంత్రాంగం అలసత్వం'
కరీంనగర్లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జిల్లాలో ప్రజలు విషజ్వారాలతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
'విషజ్వరాలతో బాధపడుతున్నా యంత్రాంగం అలసత్వం'