'రిజిస్ట్రేషన్ లేకుండానే వయోవృద్ధులకు వ్యాక్సిన్' - cowin app
వయోవృద్ధులు రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వ్యాక్సిన్‌కు హాజరు కావచ్చని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. కొవిన్ సాప్ట్‌వేర్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్‌కు వచ్చే వయోవృద్ధులు రిజిస్ట్రేషన్ లేకుండా తమ వయస్సు ధ్రువీకరణ పత్రంతో నేరుగా టీకా తీసుకోవచ్చని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. ఆస్పత్రుల్లో వారిపేరును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా ఇస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పట్ల క్రమంగా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. రోజురోజుకు వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, అవసరానికి అనుగుణంగా కేంద్రాల సంఖ్యనూ పెంచుతున్నామంటున్న వైద్యాధికారి డాక్టర్ సుజాతతో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...