కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వాసుపత్రి ఎదుట కరోనా అనుమానితులు నిరసనకు దిగారు. ఉదయం నుంచే ఆసుపత్రికి చేరుకొని క్యూలో నిల్చున్నామని.. తీరా పరీక్షలు చేసే సమయంలో వైద్య సిబ్బంది కిట్లు లేవు రేపు రావాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూశామన్నారు. రోజూ నామమాత్రంగానే పరీక్షలు చేసి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రి ఎదుట కరోనా అనుమానితుల ఆందోళన
ఉదయమే ఆస్పత్రికి చేరుకొని గంటల తరబడి లైన్లలో నిల్చున్నా... కరోనా పరీక్షలు చేయడం లేదంటూ కరోనా అనుమానితులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ప్రభుత్వాసుపత్రి ఎదుట కరోనా అనుమానితుల ఆందోళన
పరీక్షల కోసం టోకెన్లను జారీ చేస్తున్నారని, టోకెన్ ఉన్నవారికి మాత్రమే పరీక్షలు జరుపుతున్నారని కరోనా అనుమానితులు చెబుతున్నారు. గంటల తరబడి వరసలో నిల్చున్న వారికి టోకెన్లు లేవు, కిట్లు లేవంటూ వెళ్లిపోమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆసుపత్రికి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.