కరీంనగర్లో పోలీసుల తనిఖీలు - CORDON SEARCH
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
సీసీ కెమెరాల లక్ష్యంగా నిర్భంద తనిఖీలు
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల లక్ష్యంగా పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్‌లో అదనపు సీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికి గ్రామాల్లో 5వేల సీసీ కెమెరాలు బిగించామని తెలిపారు. ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.
TAGGED:
CORDON SEARCH