సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. గీతాభవన్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. సీఏఏ, ఎన్నార్సీలను ఉపసంహరించుకోవాలంటూ ప్లకార్డులతో పాటు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మైనార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు. దేశంలో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలను భయపెట్టేందుకు భాజపా ప్రభుత్వం యత్నిస్తోందని.. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేయదలిచిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి... జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ
కరీంనగర్‌లో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ