కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేశారు. కరీంనగర్-మంచిర్యాల రహదారిపై రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిన సమయంలో ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన - karimnagar district news
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్-మంచిర్యాల రహదారిపై రాస్తారోకో చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
లాక్డౌన్ విధించటంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్త సమస్యను ముందు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టబొమ్మను దహనం చేశారు.
ఇవీ చూడండి: గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ